IMEI సర్టిఫికేషన్ సైట్ లో కనిపించిన Xiaomi MIX Flip

Highlights

  • ఫ్లిప్ ఫోన్ పై పని చేస్తున్న Xiaomi సంస్థ
  • త్వరలో లాంచ్ కానున్న ఫోల్డబుల్ డివైజ్
  • తాజాగా ఐఎంఈఐ సైట్ పై కనిపించిన Xiaomi MIX Flip

ఇటీవలె చైనాలో జరిగిన ప్రొడక్ట్ ఈవెంట్ లో షావోమి కంపెనీ పలు ఉత్పత్తులను లాంచ్ చేసింది. షావోమి నుంచి Xiaomi mix Fold 3, Redmi K60 Ultra, Xiaomi Pad 6 Max వంటి ఇతర ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. Xiaomi Mix Fold 3 గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాదని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇదిలా ఉండగా, ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. ప్రస్తుతం షావోమి Xiaomi MIX Flip పై పని చేస్తున్నట్లు వెల్లడించింది.

టిప్‌స్టర్ తెలిపిన Xiaomi MIX Flip సమాచారం

షావోమి ప్రస్తుతం N17 అనే కోడ్ నంబర్ గల కొత్త స్మార్ట్ ఫోన్స్ సిరీస్ పై పని చేస్తున్నట్లు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. తాజాగా సదరు టిప్‌స్టర్ Xiaomi MIX Flip డివైజ్ ని ఐఎంఈఐ లిస్టింగ్ పై గుర్తించింది. దీంతో డివైజ్ యొక్క మోడల్ నంబర్, మానికర్ రివీల్ అయ్యాయి. లిస్టింగ్ పై Xiaomi MIX Flip డివైజ్ 2311BPN23C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్ యొక్క IMEI జాబితా రాబోయే MIX ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర స్పెసిఫికేషన్‌లను బయటపెట్టలేదు. Xiaomi సంస్థ నుంచి రాబోవు ఫ్లిప్ ఫోన్, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Samsung Galaxy Z Flip 5, Motorola Razr 40 మరియు ఇతర క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడనుంది. Xiaomi కంపెనీ MIX Flip మరియు MIX Fold 4 స్మార్ట్‌ఫోన్‌లను 2024లో విడుదల చేయవచ్చని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

ఈ సరికొత్త షావోమి ఫ్లిప్‌ ఫోన్ Qualcomm Snapdragon సిరీస్ చిప్‌సెట్‌లతో రానుందని టిప్‌స్టర్ ధృవీకరించారు. GSMchina రాబోయే క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్కీమాటిక్ రెండర్‌ను షేర్ చేసింది. Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తాజా నివేదిక పేర్కొంది. సరే, ఓసారి ఇటీవలె లాంచైన Xiaomi Fold 3 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Xiaomi Fold 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Xiaomi Fold 3 లో 8.03-ఇంచ్ ఫోల్డబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రెజుల్యూషన్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6.56-ఇంచ్ కవర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi Fold 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi Fold 3 లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi Fold 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Xiaomi Fold 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi Fold 3 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ (3.2x ఆప్టికల్ జూమ్), 10ఎంపి ఓఐఎస్ పెరిస్కోప్ లెన్స్ (5x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Xiaomi Fold 3 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్ 596 సెన్సర్ ఉంది.
  • బ్యాటరీ: Xiaomi Fold 3 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi Fold 3 డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.