Xiaomi MIX Flip: గీక్‌బెంచ్‌పై కనిపించిన షావోమి మిక్స్ ఫ్లిప్

Highlights

  • త్వరలో Xiaomi MIX Flip లాంచ్
  • జులై ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం
  • మోడల్ నంబర్ 240CPX3DC

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్‌పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi MIX Flip గీక్‌బెంచ్ లిస్టింగ్

Xiaomi MIX Flip ఫోల్డబుల్ ఫోన్ గీక్‌బెంచ్‌పై 2405CPX3DC అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2087 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 6282 పాయింట్లు నమోదు చేసింది.

Xiaomi MIX Flip ఫోల్డబుల్ ఫోన్ 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఆక్టా-కోర్ చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ పై ఉన్న వివరాలను బట్టి, Xiaomi MIX Flip ఫోల్డబుల్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలె Xiaomi MIX Flip డివైజ్ ఎన్‌సీసీ సర్టిఫికేషన్ పై కనిపించింది. దీని ద్వారా ఈ ఫోన్ లో కవర్ డిస్ప్లే పై నిలువుగా రెండు కెమెరాలు ఉంటాయని అర్థమైంది. Xiaomi MIX Flip లోని ఇన్నర్ డిస్ప్లేపై సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉంటుందని సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

Xiaomi MIX Flip స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 1145mAh+3595mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయిని లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. జులై ఆఖర్లో Xiaomi MIX Flip డివైజ్ లాంచ్‌ ఉంటుంది.

Previous articlePOCO M6 Plus 5G: లాంచ్‌కి ముందు లీకైన ఎమ్6 ప్లస్ 5జీ ధర
Next articleFlipkart GOAT సేల్ వివరాలు తెలుసుకోండి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.