Xiaomi 14T: ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందిన షావోమి 14టీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో Xiaomi 14T లాంచ్
  • మోడల్ నంబర్ 2406APNFAG
  • ఇంకా వెల్లడికాని లాంచ్ టైమ్‌లైన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో 14T సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్‌లో Xiaomi 14T మరియు Xiaomi 14T Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే షావోమి నుంచి ఇంకా ఈ సిరీస్ యొక్క లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Xiaomi 14T డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎండీఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం.

Xiaomi 14T ఐఎండీఏ లిస్టింగ్

Xiaomi 14T డివైజ్‌ను ఐఎండీఏ డేటాబేస్ పై తొలుత MySmartPrice గుర్తించింది.

Xiaomi 14T డివైజ్ 2406APNFAG అనే మోడల్ నంబర్‌తో ఐఎండీఏ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ ప్లాట్పామ్ పై కూడా కనిపించింది. ఫోన్ పేరు కూడా ఈ లిస్టింగ్ లో పేర్కొనబడింది.

మోడల్ నంబర్ లో ఉన్న 2406 ని గమనిస్తే, ఇది జూన్ నెలాఖరులో లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు.

Xiaomi 14T డివైజ్ గత మోడల్ Xiaomi 13T కి సక్సెసర్‌గా వస్తోంది. ఓసారి 13టీ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi 13T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Xiaomi 13T డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ.

కెమెరా: Xiaomi 13T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఒక థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Xiaomi 13T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Xiaomi 13T లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.