Xiaomi 14T Pro ఎన్బీటీసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వివరాలు

Highlights

  • త్వరలో Xiaomi 14T Pro లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ 2407FPN8EG
  • 50ఎంపి లైకా కెమెరా సిస్టమ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో 14-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi 14T Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Xiaomi 14T Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పై 2407FPN8EG అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

షావోమి నుంచి రాబోవు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు Xiaomi 14T Pro అని లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్రకారం, Xiaomi 14T Pro డివైజ్ జీఎస్ఎమ్/డబ్ల్యూసీడీఎంఏ/ఎల్టీఈ/ఎన్ఆర్ కనెక్టివిటీతో వస్తోంది.

ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు కనెక్టివిటీ వివరాలు తప్పా, మరే ఇతర సమాచారం రివీల్ కాలేదు.

Xiaomi 14T Pro కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీని ద్వారా కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

Xiaomi 14T Pro డివైజ్ ఓఐఎస్ ఫీచర్, 50ఎంపి మెయిన్ సెన్సర్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi 14T Pro డివైజ్ లో 8.1ఎంపి పిక్సెల్-బైన్డ్ ఇమేజెస్ క్యాప్చర్ చేయగల సెల్ఫీ కెమెరా ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ కెమెరా అపర్చర్ f/2.0 అని లిస్టింగ్ పై ఉంది.

ఓ నివేదిక ప్రకారం, Xiaomi 14T Pro డివైజ్ లైకా కెమెరా సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Xiaomi 14T Pro టైమ్‌లైన్, చిప్సెట్ వివరాలు (అంచనా)

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో లాంచ్ అవుతుందని సమాచారం.

ఇంకా ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్సెట్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.25 గిగాహెర్ట్జ్.

Xiaomi 14T Pro డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గత మోడల్స్ Xiaomi 12T, Xiaomi 13T డివైజెస్ కూడా భారత్ లో లాంచ్ కాలేదు. రానున్న రోజుల్లో ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.