Xiaomi: గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14, Xiaomi 14 Ultra

Highlights

  • గ్లోబల్ గా లాంచైన Xiaomi 14, 14 Ultra
  • మార్చి 7 న భారత్ లో విడుదల
  • 16జిబి+512జిబి స్టోరేజీతో వచ్చిన Xiaomi 14 Ultra

Xiaomi 14 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. Xiaomi 14 భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ యొక్క గ్లోబల్ ధరలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ధరలు

  • Xiaomi 14 డివైజ్ బ్లాక్, వైట్ మరియు జేడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Xiaomi 14 12జిబి+256జిబి మోడల్ ధర 999 యూరోలు (సుమారు రూ.89,725) గా ఉంది.
  • Xiaomi 14 12జిబి+512జిబి మోడల్ ధర 1,099.99 యూరోలు (సుమారు రూ.98,795) గా ఉంది.
  • Xiaomi 14 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Xiaomi 14 Ultra ధరను 1,499 యూరోలుగా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో ఈ ఫోన్ ధర సుమారు రూ.1,34,700 గా ఉంటుంది.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1440*3200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 80 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.