Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro

Highlights

  • నేడు చైనాలో లాంచైన Xiaomi 14 సిరీస్
  • హైపర్ఓఎస్ తో వచ్చిన డివైజెస్
  • Xiaomi 14 ప్రారంభ ధర 3,999 (రూ.46,000)

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నేడు చైనాలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈలైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Xiaomi 14 మరియు Xiaomi 14 Pro. ఈ రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చాయి. సరే, ఓసారి Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 ధర

  • Xiaomi 14 చైనా మార్కెట్ లో 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,299 (సుమారు రూ.49,000)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4,599 యువాన్లు (రూ.52,000)
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (రూ.57,000)

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ సీ8 1.5కే ఓఎల్ఈడీ 12-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

Xiaomi 14 Pro ధర

  • Xiaomi 14 Pro డివైజ్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (సుమారు రూ.57,000).
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 5,499 యువాన్లు (సుమారు రూ.63,000).
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 5,999 యువాన్లు (సుమారు రూ.68,000).
  • స్పెషల్ టైటానియమ్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఎడిషన్ ధర 6,499 యువాన్లు (సుమారు రూ.74,000) గా ఉంది.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.73-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 Pro లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 Pro లో 50ఎంపి లైట్ హంటర్ 900 ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి జెఎన్1 టెలీఫోటో ఓఐఎస్ లైకా సమ్మిలక్స్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro డివైజ్ లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.