Xiaomi: 512GB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Xiaomi 14 Ultra

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Xiaomi 14 Ultra
  • లైకా కెమెరాలతో వచ్చిన డివైజ్
  • Xiaomi 14 Ultra ధర రూ.99,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Xiaomi నేడు భారతీయ మార్కెట్ లో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తొలుత Xiaomi 14 మాత్రమే లాంచ్ అవుతుందని భావించారు. కానీ, షావోమి అందరినీ ఆశ్చర్యపరుస్తూ Xiaomi 14 Ultra ని కూడా లాంచ్ చేసింది. ఈ ఆర్టికల్ లో మనం Xiaomi 14 Ultra యొక్క స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra ధర

Xiaomi 14 Ultra డివైజ్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.99,999 గా నిర్ణయించారు.

కంపెనీ ఈ ఫ్లాగ్షిప్ ని కేవలం ఒక వేరియంట్ లో మాత్రమే తీసుకొచ్చింది.

మార్చి 7వ తేదీ నుంచి Xiaomi 14 Ultra రిజర్వేషన్ మొదలైంది. ఇక ఏప్రిల్ 12 నుంచి అమ్మకాలు మొదలవ్వనున్నాయి.

Xiaomi 14 Ultra ఆఫర్

Xiaomi 14 Ultra డివైజ్ కొనుగోలుపై 3 నెలల యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

ఐసీఐసీఐ కార్డ్ ద్వారా రూ.5,000 డిస్కౌంట్ యూజర్లకు లభిస్తుంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ బోనస్ క్రింద రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఇంకా కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై వన్‌ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, వ్యారంటీ ముగిసిన ఫోన్లకు వన్ టైమ్ ఫ్రీ రిపేర్ సర్వీస్ ను అందిస్తోంది.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1440*3200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Ultra 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 80 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.