Xiaomi: గీక్‌బెంచ్‌పై లిస్టైన Xiaomi 14 Ultra, ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • త్వరలో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14 Ultra
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో Xiaomi 14 Ultra డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మోడల్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఇకపోతే, Xiaomi 14 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. ఇంకా భారత్ సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ కాలేదు. సరే, ఓసారి Xiaomi 14 Ultra యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Xiaomi 14 Ultra గీక్‌బెంచ్ పై 24030PN60G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇందులో G గ్లోబల్ మోడల్‌ని సూచిస్తోందని చెప్పవచ్చు.
  • Xiaomi 14 Ultra డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 9,317 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 26,523 పాయింట్లు నమోదు చేసింది.
  • Xiaomi 14 Ultra లో ఆక్టా-కోర్ చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Xiaomi 14 Ultra స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ లో పేర్కొనబడి ఉంది.
  • Xiaomi 14 Ultra డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ లో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Xiaomi 14 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

  • చైనా సామాజిక మాధ్యమం వీబో పై ఒక టిప్‌స్టర్ Xiaomi 14 Ultra యొక్క లాంచ్ టైమ్‌లైన్ షేర్ చేశారు.
  • లీక్ ప్రకారం, Xiaomi 14 Ultra డివైజ్ ఫిబ్రవరి చివరి వారంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • Xiaomi 14 Ultra లైకా లెన్స్, వేరియబుల్ అపర్చర్ తో వస్తోందని సమాచారం.
  • ఓసారి Xiaomi 14 Ultra యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.7-ఇంచ్ క్వాడ్ కర్వ్ అమోలెడ్ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Ultra డివైజ్ 16జిబి వరకు ర్యామ్ మరియు 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Ultra లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి సోని ఎల్‌వైటీ900 ఓఐఎస్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Ultra లో ఐపీ68 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.