Xiaomi: NBTC వెబ్‌సైట్ పై లిస్టైన Xiaomi 14 గ్లోబల్ వేరియంట్

Highlights

  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Xiaomi 14 సిరీస్
  • అక్టోబర్ 2023 లో చైనాలో లాంచైన Xiaomi 14 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Xiaomi 14, Xiaomi 14 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో గ్లోబల్ మార్కెట్ లో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ డివైజెస్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు టెక్ ఔత్సాహికులు Xiaomi 14 సిరీస్ గ్లోబల్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 ఎన్బీటీసీ లిస్టింగ్

  • Xiaomi 14 గ్లోబల్ వేరియంట్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • Xiaomi 14 డివైజ్ 23127PN0CG అనే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది.
  • ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా Xiaomi 14 డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.
  • కానీ, ఇప్పటికే Xiaomi 14 సిరీస్ చైనాలో లాంచ్ అయినందున స్పెసిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి.
  • ఓసారి Xiaomi 14 చైనా వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్)

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని వాడారు.
  • కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి లైట్ హంటర్ 900 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి జెఎన్1 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మొత్తం నాలుగు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi 14 ధర

  • Xiaomi 14 చైనా మార్కెట్ లో 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4,299 (సుమారు రూ.49,000)
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4,599 యువాన్లు (రూ.52,000)
  • 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 4,999 యువాన్లు (రూ.57,000)