లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro డిజైన్ రెండర్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13T Pro
  • లైకా ట్యూన్డ్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానున్న Xiaomi 13T Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో 13T ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 13T, Xiaomi 13T Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. అయితే ఇంకా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. కానీ, చాలా రోజులుగా Xiaomi 13T Pro సర్టిఫికేషన్ సైట్స్ మరియు లీక్స్ లో కనిపిస్తూనే ఉంది. తాజాగా Xiaomi 13T Pro యొక్క డిజైన్ రెండర్స్ ని MySmartPrice షేర్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 13T Pro డిజైన్ రెండర్స్ (లీక్)

  • కొత్త రెండర్స్ ని బట్టి Xiaomi 13T Pro డిజైన్ ని చూస్తే, రీసెంట్ గా లాంచైన Redmi K60 Ultra మాదిరి ఉంది.
  • Xiaomi 13T Pro బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని పిక్స్ ద్వారా తెలుస్తోంది.
  • డిస్ప్లే గురించి మాట్లాడితే, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉంది.
  • బ్యాక్ ప్యానెల్ పై లైకా ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
  • ఫోన్ కి కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్ బాటమ్ లో ఉన్నాయి.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Xiaomi 13T Pro లో 6.67-ఇంచ్ క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • చిప్సెట్: Xiaomi 13T Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్ ఉంటుందని సమాచారం.
  • స్టోరేజీ: Xiaomi 13T Pro డివైజ్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి + 256జిబి, 12జిబి + 512జిబి, 16జిబి + 1టిబి.
  • కెమెరా: Xiaomi 13T Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో లైకా ట్యూన్డ్ సెన్సర్స్ ఉంటాయి. అయితే ఎన్ని మెగాపిక్సెల్ కెమెరా లెన్స్ ఉంటాయో ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.