Vivo: చైనాలో లాంచైన Y37 5G, Y37m 5G, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • చైనాలో వివో వై37, వై37ఎమ్ లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్
  • వివో వై37 ప్రారంభ ధర 1199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో వై-సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Vivo Y37, Vivo Y37m అనే పేర్లతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఓసారి ఈ డివైజెస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y37, Vivo Y37m ధరలు

Vivo Y37 మొత్తం 5 వేరియంట్స్ లో లభిస్తుంది. శాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. Vivo Y37 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1199 యువాన్లు (సుమారు రూ.13,790) గా ఉంది.

Vivo Y37 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1499 యువాన్లు (సుమారు రూ.17,250) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.20,690) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.22,990) గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2099 యువాన్లు (సుమారు రూ.24,150) గా ఉంది.

Vivo Y37m ధర

Vivo Y37m స్మార్ట్‌ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 999 యువాన్లు (సుమారు రూ.11,790) గా ఉంది.

Vivo Y37m 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1499 యువాన్లు (సుమారు రూ.17,250) గా ఉంది.

Vivo Y37m 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.22,990) గా ఉంది.

Vivo Y37 5G, Vivo Y37m 5G స్మార్ట్‌ఫోన్లు 3 కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. డిస్టంట్ గ్రీన్ మౌంటెయిన్స్, లింగ్వాంగ్ పర్పుల్ మరియు మూన్ షాడో బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతాయా లేదా అనేది ఇంకా తెలియదు.

Vivo Y37, Vivo Y37m స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y37 మరియు Vivo Y37m ఫోన్లలో 6.56-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.15:9 యాస్పెక్ట్ రేషియో, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y37 మరియు Vivo Y37m 5జీ డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.

మెమొరీ: Vivo Y37, Vivo Y37m డివైజెస్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చాయి. ఇక Vivo Y37m 8జిబి ర్యామ్ తో లాంచ్ కాగా, Vivo Y37 12జిబి ర్యామ్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా 128జిబి మరియు 256జిబి స్టోరేజీకి సపోర్ట్ చేస్తాయి.

కెమెరా: ఈ రెండు వివో స్మార్ట్‌ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ యాంటీ-స్ట్రోబ్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo Y37, Vivo Y37m డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

సాఫ్ట్‌వేర్: Vivo Y37, Vivo Y37m స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

కనెక్టివిటీ: Vivo Y37, Vivo Y37m ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: వివో వై37, వివో వై37ఎమ్ డివైజెస్‌లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Previous articleiQOO Z9 Lite 5G: తక్కువ ధరలో లాంచైన ఐకూ జెడ్9 లైట్ 5జీ
Next articlePOCO M6 Plus 5G: లాంచ్‌కి ముందు లీకైన ఎమ్6 ప్లస్ 5జీ ధర
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.