Vivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Vivo Y28s 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ చిప్
  • మోడల్ నంబర్ V2346

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వివో వై28ఎస్ 5జీ లాంచ్ కానుంది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై Vivo V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మదర్‌బోర్డ్ సెక్షన్ పై k6835v2_64 అనే కోడ్ నేమ్ రాయబడి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6080 చిప్సెట్ అయ్యే అవకాశం ఉంది.

Vivo Y28s 5G ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40 గిగాహెర్ట్జ్. మాలి జీ57 జీపీయూ లిస్టింగ్ పై కనిపిస్తోంది.

గీక్‌బెంచ్ పై Vivo Y28s 5G 8జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది. 6జిబి ర్యామ్ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఈ వివో కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28s 5G డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 599 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1707 పాయింట్లు స్కోర్ చేసింది.

వివో వై28ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీన్ని బట్టి త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo Y28 5G ధర

Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది. ఈ ఫోన్ క్రిస్టల్ పర్పుల్ మరియు గ్లిట్టర్ ఆక్వా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 7 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.