Vivo Y28s 5G: ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో వివో వై28ఎస్ అమ్మకాలు ప్రారంభం, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Highlights

  • Vivo Y28s 5G సేల్ ప్రారంభం
  • రిటైల్ స్టోర్స్ లో అమ్మకాలు
  • ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ముందుగా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే రిటైల్స్ స్టోర్స్ లో అమ్మకాలు కూడా మొదలయ్యాయి. అయితే అధికారికంగా వివో నుంచి ఫోన్‌కి సంబంధించిన ప్రకటన ఏదీ రాలేదు. కానీ, Vivo Y28s 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి లభించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందామా?

Vivo Y28s 5G ధర

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G యొక్క 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,499 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జులై ప్రారంభం నుంచి మొదలయ్యాయి. గత మోడల్ Vivo Y28 కి సక్సెసర్‌గా Vivo Y28s 5G డివైజ్‌ని వివో మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

రిటైల్స్ వర్గాల ప్రకారం, కొన్ని రోజుల్లో Vivo Y28s 5G 8జిబి ర్యామ్ వేరియంట్ మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. దీని ధర రూ.16,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కలర్ ఆప్షన్స్ వివరాలు తెలుసుకుందాం. పర్పుల్ మరియు బ్లూ కలర్స్ లో వివో వై28ఎస్ 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ 3 మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.