Vivo Y28s 5G: టీడీఆర్ఏ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వై28ఎస్ 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో Vivo Y28s 5G లాంచ్
  • టీడీఆర్ఏపై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2346

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇదివరకు ఇతర సర్టిఫికేషన్స్‌ను కూడా పొందింది. ఓసారి టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y28s 5G టీడీఆర్ఏ లిస్టింగ్

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ లో Vivo Y28s 5G పేరును గమనించవచ్చు. మోడల్ నంబర్, పేరు తప్పితే మరే ఇతర వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

టీడీఆర్ఏ తో పాటు ఇతర సర్టిఫికేషన్స్ పై డివైజ్ కనిపించడంతో, త్వరలోనే లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై 5, ఐపీ54 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.