Vivo Y28s 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో కొత్త ఫోన్

Highlights

  • గ్లోబల్‌గా Vivo Y28s 5G లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 6.56-ఇంచ్ 90 హెర్ట్జ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా గ్లోబల్ మార్కెట్ లో వై-సిరీస్ లో ఒకొ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28s 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.56-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 8జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G ధర, కలర్ ఆప్షన్స్

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే రూ.15,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. మోచా బ్రౌన్ మరియు ట్వింకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Vivo Y28s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s 5G లో 6.56-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28s 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ వరకు లభిస్తుంది.

కెమెరా: Vivo Y28s 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y28s 5G లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 150% వాల్యూమ్ బూస్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.