Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G

Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • మోడల్ నంబర్ V2352
  • హీలియో జీ85 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ తో పాటు, ఐఎండీఏ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo Y28 4G యొక్క మోడల్ నంబర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y28 4G గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు ఐఎండీఏ లిస్టింగ్స్ పై V2352 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y28 4G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 412 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1266 పాయింట్లు స్కోర్ చేసింది.

2+6 కోర్స్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉన్నట్లు లిస్టింగ్ పై ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0GHz.

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ వివరాను బట్టి, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

స్టోరేజీ విషయానికి వస్తే, Vivo Y28 4G డివైజ్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ FCC ప్లాట్ఫామ్ పై V2352 అనే మోడల్ నంబర్ ద్వారా లిస్ట్ అయ్యింది.

BA45 అనే మోడల్ నంబర్ తో ఒక బ్యాటరీ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. 5870ఎంఏహెచ్ బ్యాటరీ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. అంటే దీన్ని కంపెనీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీగా మార్కెట్ చేయవచ్చు.

Vivo Y28 4G డివైజ్ ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ వై-ఫై, బ్లూటూత్, ఎల్టీఈ సపోర్ట్ తో వస్తోంది.

Vivo Y28 4G డివైజ్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo Y28 4G బేస్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది.

Vivo Y28 4G డివైజ్ యొక్క బేస్ మోడల్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వస్తోంది.

రానున్న రోజుల్లో Vivo Y28 4G యొక్క గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ వివరాలు వెల్లడి కానున్నాయి.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.