Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i

Highlights

  • త్వరలో Vivo Y200i లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్, 3సీ మరియు చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ధర రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200i డిజైన్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ డిజైన్ చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ ని గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్, మందపాటి చిన్ డిస్ప్లేపై ఉన్నాయి.

వివో వై200ఐ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Vivo Y200i లో 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ టాప్ లో ఉన్నాయి. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి.

వివో వై200ఐ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ తెలుపు రంగులో లాంచ్ కానుంది. ఇతర కలర్ వేరియంట్స్ గురించి సమాచారం లేదు.

Vivo Y200i డివైజ్ 165.70 మి.మీ పొడవు, 76.00 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y200i ధర, స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.

బేస్ మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.21,200), మిడ్ వేరియంట్ ధర CNY 1,899 (సుమారు రూ.22,300), టాప్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,500) గా ఉన్నాయి.

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల డిస్ప్లేతో వస్తోంది.

ఈ కొత్త ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Vivo Y200i గీక్‌బెంచ్ మరియు 3సీ లిస్టింగ్

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు 3సీ వెబ్‌సైట్స్ పై V2354A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3,199 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7,931 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ ప్రకారం, వివో వై200ఐ అడ్రెనో 613 జీపీయూ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇంకా లిస్టింగ్ పై Vivo Y200i 8జిబి ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. Vivo Y200i డివైజ్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.