Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y200e 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y200e 5G లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వివరాలు

  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ 6 పై జనవరి 22న పరీక్షించబడింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3115 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 8112 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Vivo Y200e 5G డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G డివైజ్ మదర్ బోర్డ్ కోడ్ నేమ్ ప్యారెట్ అని ఉంది. ఇది అడ్రోనో 613 జీపీయూ ని కలిగి ఉంది.
  • వివరాలను బట్టి, Vivo Y200e 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని చెప్పవచ్చు.
  • Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • మరోవైపు, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా Vivo Y200e 5G పేరు ఖరారైంది. అలాగే బ్లూటూత్ 5.0 సపోర్ట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.