Vivo Y200 Plus 5G: ఐఎంఈఐ సర్టిఫికేషన్ పొందిన వివో వై200 ప్లస్ 5జీ

Highlights

  • త్వరలో Vivo Y200 Plus 5G లాంచ్
  • ఐఎంఈఐ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2401

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎంఈఐ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y200 Plus 5G ఐఎంఈఐ సర్టిఫికేషన్ వివరాలు

Vivo Y200 Plus 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఐఎంఈఐ పై V2422 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. తొలుత ఈ విషయాన్ని Gizmochina గుర్తించింది.

Vivo Y200 Plus 5G యొక్క ఐఎంఈఐ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

గత మోడల్ Vivo Y200 లో కంటే మెరుగైన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ Vivo Y200 Plus 5G లో ఉంటాయని భావిస్తున్నారు. ఓసారి Vivo Y200 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.

ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.

ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.