Vivo: మే 20న లాంచ్ అవుతోన్న Vivo Y200t, Y200 GT

Highlights

  • మే 20న వివో వై200టీ, వై200 జీటీ లాంచ్
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న Y200 GT
  • 6.72-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Y200t

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో రెండు వై-సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. Y200 GT మరియు Y200t అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా వీటి లాంచ్ వివరాలను కంపెనీ ప్రకటించింది. మే 20వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఓసారి రెండు ఫోన్ల యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y200 GT స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo Y200 GT లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y200 GT లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8GHz.

కెమెరా: Vivo Y200 GT లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo Y200 GT లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y200t స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo Y200t లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ హై బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y200t లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

కెమెరా: Vivo Y200t లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo Y200t లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.