Vivo: 512GB స్టోరేజీతో చైనాలో లాంచైన Vivo Y200 GT, Y200t

Highlights

  • చైనాలో వివో వై200 జీటీ, వై200టీ లాంచ్
  • 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్
  • 80 వాట్/44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో రెండు వై-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Vivo Y200 GT, Vivo Y200t పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లలో 50ఎంపి మెయిన్ కెమెరా సెటప్ ఉంది. వై200 జీటీ ఫోన్‌ని ప్రధానంగా గేమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. అందుకే ఈ ఫోన్లో పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి వై200 జీటీ మరియు వై200టీ ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y200 GT స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200 GT డివైజ్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200 GT లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 GT లో 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Vivo Y200 GT లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y200 GT లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y200 GT డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బరువు, చుట్టుకొలత: బరువు, చుట్టుకొలత: Vivo Y200 GT 163.72 మి.మీ పొడవు, 75.88 మి.మీ వెడల్పు, 7.98 మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y200 GT లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

Vivo Y200t స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200t లో 6.72-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200t లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200t లో 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Vivo Y200t లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ: Vivo Y200t లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

బరువు, చుట్టుకొలత: Vivo Y200t 165.7 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y200t లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.