Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్!

Highlights

  • త్వరలో Vivo Y18 భారత్ లో లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2333
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇదివరకు ఇదే ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y18 యొక్క BIS సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y18 బీఐఎస్ లిస్టింగ్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై V2333 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇదే మోడల్ నంబర్ తో గతంలో బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై కూడా Vivo Y18 లిస్ట్ అయ్యింది.

మరో విషయం ఏంటంటే, ఇదే మోడల్ నంబర్ తో గ్లోబల్ మార్కెట్ లో వివో సంస్థ Vivo Y03 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది.

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో వివో వై03 కి రీబ్రాండ్ వర్షన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo Y18 స్పెసిఫికేషన్స్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

వివో వై18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ52 జీపీయూ ఉంటాయి.

Vivo Y18 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గతంలో ఓ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇతర స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

వివో వై18 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: రివీలైన Vivo X100 Ultra లాంచ్ టైమ్‌లైన్

Vivo Y03 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y03 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y03 లో ఎంట్రీ లెవెల్ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. అంటే యూజర్ కి 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.