Vivo Y18: 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్

Highlights

  • నేడు భారత్ Vivo Y18 లాంచ్
  • మీడియాటెక్ హీలియో చిప్సెట్
  • 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారత్ లో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo Y18 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీ, హెచ్డీ+ స్క్రీన్, మీడియాటెక్ హీలియో చిప్సెట్, ఐపీ54 రేటింగ్, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చింది. ఓసారి వివో వై18 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y18 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా పెట్టారు. వివో ఈస్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. Vivo Y18 డివైజ్ జెమ్ గ్రీన్ మరియు స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. పదివేల లోపు బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావించే వారికి వివో వై18 మంచి ఆప్షన్ అవ్వవచ్చు.

Vivo Y18 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 83 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ గేముత్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.

కెమెరా: Vivo Y18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, వీజీఏ (0.8ఎంపి) సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18 డివైజ్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: Vivo Y18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y18 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

భద్రత: Vivo Y18 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

కనెక్టివిటీ: Vivo Y18 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo Y18 డివైజ్ 163.63 మి.మీ పొడవు, 75.58 మి.మీ వెడల్పు, 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.