4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్స్

Highlights

  • కొత్త వేరియంట్స్ తో వచ్చిన Vivo Y16, Vivo Y22
  • 4జిబి ర్యామ్ తో లాంచైన రెండు స్మార్ట్ ఫోన్స్
  • Vivo Y16 ధర రూ.12,999, Vivo Y22 ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Vivo T2 ని లాంచ్ చేసింది. దీంతో పాటు కంపెనీ నుంచి Vivo Y16, Vivo Y22 డివైజెస్ యొక్క కొత్త వేరియంట్లను కూడా లాంచ్ అయ్యాయి. ఇంతకంటే ముందు వై-సిరీస్ లో వివో Vivo Y100A డివైజ్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి వివో వై16 మరియు వై22 డివైజెస్ ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్లు

  • 4జిబి ర్యామ్ తో లాంచ్

Vivo Y16, Y22 స్మార్ట్ ఫోన్లు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యాయి. వై16 కొత్త వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. మరోవైపు వై22 కొత్త వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది.

Vivo Y16 డివైజ్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y22 డివైజ్ వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్
  • డ్యూయల్ రియర్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ వడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y22 స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ ఎమ్‌టీ6769 చిప్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ 2.5డి డిస్ప్లే ఇచ్చారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ ఎమ్‌టీ6769 ప్రాసెసర్ వాడారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా వచ్చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y22 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y22 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించరాు. ఈ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.