రూ.12,499 ధరతో లాంచ్ అయిన Vivo Y16

హైలైట్స్:

  • Vivo Y16 లాంచ్ గురించి ముందే చెప్పిన 91మొబైల్స్
  • రూ.12,499 ధరతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y16 స్మార్ట్ ఫోన్
  • 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోన్న Vivo Y16

Vivo Y16 స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవుతుందని దీని ధర రూ.12,499 గా ఉంటుందని ఇదివరకే 91మొబైల్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజాగా వివో కంపెనీ Vivo Y16 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో సరిగ్గా మేం చెప్పిన ధరకే లాంచ్ చేసింది. దీంతో 91మొబైల్స్ అంచనా రుజువైనట్లయ్యింది.

భారత్ లో Vivo Y16 ధర

రూ.12,499 ధరతో భారత్ లో Vivo Y16 ఫోన్ లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్రిజ్లింగ్ గోల్డ్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

ఇప్పుడు Vivo Y16 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo Y16 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.19 మిల్లీ మీటర్లు మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు.

Vivo Y16 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఫుల్ బ్యాటరీ 18 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Vivo Y16 లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 5ఎంపి కెమెరా ఉంది. పనోరమా, ఫేస్ బ్యూటీ, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్ వంటి మరెన్నో కెమెరా ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Vivo Y16 లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది. ఇది 4జీ ఎల్టీఈ సపోర్ట్ కలిగి ఉంది. 3.5 ఎంఎం జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ వర్షన్ 5.0, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇక వివో ఫ్యూచర్ లాంచెస్ గురించి చూస్తే, త్వరలోనే ఈ కంపెనీ నుంచి Vivo X90 Pro+ లాంచ్ కానుంది. డిసెంబర్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇస్తుందని సమాచారం. లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. 1-ఇంచ్ కెమెరా, సరికొత్త టెలీఫోటో లెన్స్ తో ఈ ఫోన్ రానుందని టాక్ వినిపిస్తోంది. టెలీఫోటో లెన్స్ కోసం ప్రత్యేకమైన టెలీఫోటో అల్గారిథమ్ ని ఈ ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleనేడు భారత్ లో లాంచ్ అయిన Tecno Pova Neo 5G
Next articleలీకైన OPPO A17 స్మార్ట్ ఫోన్ డిజైన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.