Vivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G కొత్త వేరియంట్

Highlights

  • 2023 లో లాంచైన Vivo Y100 5G
  • Snapdragon 4 Gen 2 చిప్‌తో రానున్న కొత్త వర్షన్
  • కలర్ ఆప్షన్స్: బ్లాక్, పర్పుల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది అక్టోబర్ లో Vivo Y100 5G డివైజ్ ని చైనీస్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే ఇదే పేరుతో మరో ఫోన్ ని వివో లాంచ్ చేయనుందని సమాచారం. ఈ విషయాన్ని Appuals తన కథనంలో వెల్లడించింది. Vivo Y100 5G కొత్త వర్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో రానుంది. సరే, ఓసారి Vivo Y100 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo Y100 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హోల్ నాచ్ డిజైన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y100 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y100 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: Vivo Y100 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y100 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది. డివైజ్ లెదర్ ఫినిష్ కలిగి, యాంటీ-స్టెయిన్ కోటింగ్ తో రానుంది. Vivo Y100 5G డివైజ్ 7.79 మి.మీ మందం ఉంటుంది. ఇంకా ఐపీ54 రేటింగ్ తో ఈ ఫోన్ రానుంది.