Vivo: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన Y100 4G

Highlights

  • త్వరలో Vivo Y100 4G లాంచ్
  • ఎన్బీటీసీపై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2342

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం భారత్ లో Vivo Y100 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధర రూ.21,999 గా ఉంది. మరోవైపు, వివో సంస్థ త్వరలో Vivo Y100 4G ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ పేరు, మోడల్ నంబర్ వంటి వివరాలు బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y100 4G ఎన్బీటీసీ లిస్టింగ్

Vivo బ్రాండ్ కి చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై V2342 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y100 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని లిస్టింగ్ ద్వారా ఖరారైంది. ఎన్బీటీసీ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. త్వరలోనే Vivo Y100 4G మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y100 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్), 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ ఉపయోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y100 5G డివైజ్ లో 12జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 12జిబి ఫిజికల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్ కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo Y100 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y100 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.