Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s

Highlights

  • త్వరలో Vivo X100s లాంచ్
  • MIIT సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డైమెన్సిటీ 9300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్

Vivo X100s డివైజ్ ఎంఐఐటీ వెబ్‌సైట్ పై V2359A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గతంలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. 3సీ ద్వారా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్స్ గమనిస్తే, త్వరలోనే చైనాలో లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo X100s స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X100s లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 జీపీయూ ఉంటాయి.
  • ఓఎస్: Vivo X100s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ర్యామ్: Vivo X100s డివైజ్ 16జిబి ర్యామ్ తో లాంచ్ అవుతుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo X100s డిజైన్, కలర్స్

త్వరలో లాంచ్ కాబోయే Vivo X100s డివైజ్ విభిన్నమైన డిజైన్ తో వచ్చే అవకాశం ఉంది. వివో ఎక్స్100 సిరీస్ కర్వ్డ్ డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంటుంది. కానీ, Vivo X100s డివైజ్ మాత్రం ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది.

Vivo X100s డివైజ్ వైట్, గ్రీన్, బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో రానుందని సమాచారం.

ఇటీవలె వివో ఎక్స్100ఎస్ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో కనిపించింది.