Vivo: రివీలైన X100 Ultra లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • మే నెలలో Vivo X100 Ultra లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్
  • 200ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం X100 సిరీస్‌ని భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s, Vivo X100 Ultra ఫోన్లు కూడా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మే నెలలో Vivo X100 Ultra మోడల్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని వివో వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100 Ultra లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Vivo X100 Ultra డివైజ్ వివరాలు చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ Weibo పై ప్రత్యక్షమయ్యాయి. ఈ ప్లాట్ఫామ్ పై వివో వైస్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ iQOO Z9 Turbo గురించి మాట్లాడారు. అదే సమయంలో Vivo X100 Ultra లాంచ్ గురించి కూడా హింట్ ఇచ్చారు.

క్రింద ఉన్న ఇమేజ్ ని గమనిస్తే, అందులో యూజర్ Vivo X100 Ultra లాంచ్ వచ్చే నెలలో ఉంటుందా అని జింగ్‌డాంగ్‌ని అడిగినట్లు తెలుస్తోంది. దానికి బదులుగా, అవును అని జింగ్ అన్నట్లు స్పష్టమవుతోంది.

త్వరలోనే Vivo X100 Ultra లాంచ్ తేదీని అఫీషియల్ గా వివో ప్రకటించే అవకాశం ఉంది.

రిపోర్ట్స్ ప్రకారం, Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్ టూ-వే శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం.

Vivo X100 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Vivo X100 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Ultra డివైజ్ 24జిబి వరకు ర్యామ్ + 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని మెమొరీ వేరియంట్స్ లో Vivo X100 Ultra లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

కెమెరా: Vivo X100 Ultra లో 50ఎంపి సోని ఎవై‌టీ-900 ప్రైమరీ కెమెరా, 200ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. టెలీఫోటో లెన్స్ 4.3x ఆప్టికల్ జూమ్, 200x డిజిటల్ జూమ్‌కి సపోర్ట్ చేస్తుంది.

చార్జింగ్: Vivo X100 Ultra డివైజ్ 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.