Vivo V40 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు

Highlights

  • త్వరలో Vivo V40 Pro లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న వీ40, వీ40 ప్రో
  • V40 Pro మోడల్ నంబర్ V2347

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ప్రీమియమ్ మిడ్-రేంజ్ సిరీస్ వీ40 ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 Pro థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40 Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు

Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై V2347 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే మోడల్ నంబర్ తప్పితే, మరే ఇతర వివరాలు ఎన్బీటీసీ ద్వారా రివీల్ కాలేదు. అయితే ఇదివరకు ఈ ఫోన్ యూకే‌కు చెందిన ఈఈ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

గత వారం చైనాలో లాంచైన Vivo S19 సిరీస్ లోని S19 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా Vivo V40 Pro డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. దీన్ని బట్టి, Vivo V40 Pro స్పెసిఫికేషన్స్ ఎస్19 ప్రో మాదిరి ఉంటాయని చెప్పవచ్చు.

Vivo S19 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S19 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S19 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo S19 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo S19 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo S19 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Vivo S19 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo S19 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68/69 సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.