Vivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40

Highlights

  • త్వరలో Vivo V40 లాంచ్
  • 1.5కే అమోలెడ్ డిస్ప్లే
  • మోడల్ నంబర్ V2348

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, V40 Pro, V40e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ లోని Vivo V40 మోడల్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V40 బీఐఎస్ లిస్టింగ్ వివరాలు

వివో నుంచి రాబోవు కొత్త ఫోన్ Vivo V40 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ పై V2348 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ లో కనిపించిన మోడల్ నంబర్ Vivo V40 కి చెందినదేనని గతంలో రివీలైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ ని గమనిస్తే తెలుస్తోంది.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే త్వరలోనే Vivo V40 భారత్ లో లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది.

ఇప్పటికే Vivo V40 గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దాని మాదిరి స్పెసిఫికేషన్స్ ఇండియన్ వేరియంట్ లో కూడా ఉంటాయని భావించవచ్చు.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Vivo V40 లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo V40 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇవి జీస్ సపోర్ట్ తో వచ్చాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.