Vivo: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30, V30 Pro, లీకైన లాంచ్ టీజర్ పోస్టర్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న వివో వీ30, వీ30 ప్రో
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన లాంచ్ పోస్టర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Vivo V30 సిరీస్ భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. మరో లీక్ ద్వారా Vivo V30 సిరీస్ యొక్క లాంచ్ టీజర్ పోస్టర్ రివీల్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ మరియు టీజర్ పోస్టర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V30, Vivo V30 Pro బీఐఎస్ లిస్టింగ్

  • Vivo V30 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ లిస్టింగ్ పై V2318 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 Pro డివైజ్ బీఐఎస్ లిస్టింగ్ పై V2319 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • మోడల్ నంబర్స్ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ బీఐఎస్ ద్వారా రివీల్ కాలేదు.
  • అయితే, త్వరలోనే భారత్ లో Vivo V30 సిరీస్ లాంచ్ ఉంటుందని బీఐఎస్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo V30 Pro సిరీస్ టీజర్ (లీక్)

  • Vivo V30 సిరీస్ లాంచ్ టీజర్ పోస్టర్ ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తన X ఖాతా ద్వారా షేర్ చేశారు.
  • పోస్టర్ లో Vivo V30 సిరీస్ కమింగ్ సూన్ అని రాసి ఉంది. కచ్చితమైన తేదీ ఏదీ పేర్కొనబడి లేదు.
  • త్వరలో Vivo V30 సిరీస్ మార్కెట్ లోకి రానుందని టిప్‌స్టర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
  • ఇమేజ్ లో డివైజ్ ముందు మరియు వెనుక ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. ముందువైపు పంచ్ హోల్ డిజైన్ ఉంది.

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ 1.5కే డిస్ప్లే, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండవచ్చు. వీటికి తోడు ఒక ఆరా ఎల్ఈడీ లైట్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటాయి.