Vivo: లీకైన Vivo V30 Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 Pro
  • తాజాగా లీకైన Vivo V30 Pro రెండర్స్
  • రెండు కలర్ వేరియంట్స్ లో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే గీక్‌బెంచ్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. అలాగే ఐఎంఈఐ డేటాబేస్ పై కూడా కనిపించింది. తాజాగా 91mobiles టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో Vivo V30 Pro యొక్క ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, ఓఎస్, కలర్స్ మరియు డిజైన్ వివరాలను తన కథనం ద్వారా వెల్లడించింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo V30 Pro డిజైన్ (లీక్)

  • లీకైన ఇమేజెస్ ని గమనిస్తే Vivo V30 Pro డివైజ్ బ్లాక్ మరియు గ్రీన్ కలర్స్ లో కనిపిస్తోంది.
  • Vivo V30 Pro ఫోన్‌కి ముందు కర్వ్డ్ ఎడ్జెస్, సెంట్రల్ పంచ్-హోల్ కౌటౌట్ ఉన్నాయి.
  • Vivo V30 Pro డివైజ్ కి బ్యాక్ ప్యానెల్ పై పైన కుడివైపున కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇది రెండు భాగాలుగా విడిపోయి ఉంది. పైన ఉన్నదానిలో 3 కెమెరా లెన్సులు మరియు జీస్ బ్రాండింగ్ ఉన్నాయి. క్రింది భాగంలో స్మార్ట్ ఆరా లైట్, ఫ్లాష్ లైట్ లెన్స్ ఉన్నాయి.
  • Vivo V30 Pro డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమవైపున నిలువుగా వివో బ్రాండింగ్ ఉంది.
  • Vivo V30 Pro డివైజ్ కి కుడివైపున ఫ్రేమ్ పైన వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఉన్నాయి.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరాలు: Vivo V30 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo V30 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo V30 Pro 164.4 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 7.5 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 Pro డివైజ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.