Vivo: NBTC వెబ్‌సైట్‌లో లిస్టైన Vivo V30

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30
  • ఎన్బీటీసీ పై లిస్టైన డివైజ్
  • కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V30 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ గీక్‌బెంచ్ మరియు టీడీఆర్ఏ వంటి సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Vivo V30 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo V30 యొక్క ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 NBTC లిస్టింగ్

  • Vivo V30 డివైజ్ ఎన్బీటీసీ డేటాబేస్ పై V2318 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఎన్బీటీసీ లిస్టింగ్ లో Vivo V30 అనే పేరు పేర్కొనబడి ఉంది.
  • మోడల్ నంబర్ తప్పా, Vivo V30 కి సంబంధించి మరే ఇతర వివరాలు ఎన్బీటీసీ ద్వారా రివీల్ కాలేదు.
  • ఫిబ్రవరి ఆఖరి వారంలో Vivo V30 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వివో నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన అధికార ప్రకటన రానున్న రోజుల్లో వస్తుందని భావించవచ్చు.
  • ఇప్పుడు VIVO V30 స్మార్ట్‌ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Vivo V30 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
  • కెమెరా: Vivo V30 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.