రివీలైన Vivo V29e ధర, కెమెరా స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29e
  • Vivo V29e ధర రూ.30,000 ఉండే అవకాశం
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న డివైజ్

Vivo V29e స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. Vivo V29 సిరీస్ లో భాగంగా మొదటగా Vivo V29e ఫోన్ లాంచ్ కానుంది. ఈ వారం మొదట్లో Vivo V29e డిజైన్ రెండర్స్ రివీల్ అయ్యాయి. తాజాగా భారతీయ మార్కెట్ ధర, కెమెరా స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి Vivo V29e డివైజ్ కెమెరా మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V29e కెమెరా వివరాలు

Vivo V29e స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం 91మొబైల్స్ కి అందింది. ఇండస్ట్రీ వర్గాలు Vivo V29e యొక్క కెమెరా వివరాలు తెలియజేసాయి. దాని ప్రకారం, Vivo V29e లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. అలాగే ఉత్తమమైన నైట్ పొట్రెయిట్స్ ని ఈ కెమెరా అందిస్తుందని సమాచారం. ఇంకా 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఆటోఫోకస్ ఫీచర్ తో ఈ ఫ్రంట్ కెమెరా వస్తోంది.

Vivo V29e స్మార్ట్ ఫోన్ వెడ్డింగ్ పొట్రెయిట్ ఫీచర్ తో కూడా వస్తోంది. ఈ ఫీచర్ వార్మ్, పేస్టల్ షేడ్స్ తో పాటు గోల్డ్, పింక్ టోన్స్ కలయికలో ఫోటోస్ ని అందించనుంది.

భారత్ లో Vivo V29e ధర (అంచనా)

భారత్ లో Vivo V29e స్మార్ట్ ఫోన్ ధర రూ.30,000 గా ఉండనుంది. ఇది 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో రానుంది. ఈ ఫోన్ మోటో ఎడ్జ్40, రియల్మీ 11 ప్రో+ లతో పోటీ పడనుంది. అయితే Vivo V29e ఇండియా లాంచ్ కి సంబంధించి వివో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు.

ఇప్పటివరకు Vivo V29e గురించి తెలిసిన విషయాలు

  • లీక్స్ ద్వారా Vivo V29e కి సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
  • Vivo V29e స్మార్ట్ ఫోన్ రెండర్స్ ద్వారా పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే రివీల్ అయ్యాయి. ఇంకా డ్యూయల్-టోన్ రియర్ డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరాలు వర్టికల్ గా ఉన్నాయి. ఇకపోతే Vivo V29e డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలిసింది.
  • Vivo V29e స్మార్ట్ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo V29e డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 లేదా 480+ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • Vivo V29e స్మార్ట్ ఫోన్ Vivo V29 సిరీస్ లో వచ్చే మొదటి డివైజ్ అని చెప్పవచ్చు. మిగతా మోడల్స్ లాంచ్ వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.