లాంచ్‌కి ముందు లీకైన Vivo V29e పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights

  • ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Vivo V29e
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వస్తోన్న డివైజ్
  • 7.57 మి.మీ అల్ట్రా స్లిమ్‌గా ఉండనున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo ఆగస్టు 28 న Vivo V29e డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మొబైల్ ట్రెయినింగ్ మెటీరియల్ రివీల్ అయ్యింది. దీంతో Vivo V29e హ్యాండ్సెట్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలిసాయి. మరి ఈ మిడ్-బడ్జెట్ రేంజ్ డివైజ్ లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29e వివరాలు (లీక్)

వివో నుంచి రాబోవు కొత్త్ ఫోన్ Vivo V29e యొక్క ట్రెయినింగ్ మెటీరియల్ Tech Outlook వెబ్ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. దీని ద్వారా పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలిసాయి.

డిజైన్

Vivo V29e యొక్క డిజైన్ గురించి మాట్లాడితే ఇది 3డీ కర్వ్ డిజైన్ కలిగి ఉంది. 7.57 మి.మీ మందం కలిగి, 180.5 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ అత్యంత సన్ననైన 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అని కంపెనీ చెబుతోంది. ఇక ధర విషయానికి వస్తే, మిడ్-బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది.

Vivo V29e స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ భారీ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2402*1080 పిక్సెల్స్), 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V29e డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా-కోర్ చిప్ ఉంటుంది. ఈ చిప్సెట్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • స్టోరేజీ: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో ర్యామ్ 3.0, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. అంటే యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ లో 256జిబి వరకు స్టోరేజీ అందుబాటులో ఉంటుంది.
  • కెమెరా: Vivo V29e లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఓఐఎస్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo V29e లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V29e స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.