FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Vivo V29 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V29 5G
  • ఇంకా వెలువడని అధికార ప్రకటన
  • తాజాగా FCC సైట్ పై కనిపించిన Vivo V29 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వీ-సిరీస్ లో Vivo V29 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ నుంచి దీనికి సంబంధించిన ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. కానీ, Vivo V29 5G వివిధ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. తాజాగా Pricebaba వెబ్ సైట్ Vivo V29 5G డివైజ్ ని FCC వెబ్ సైట్ పై గుర్తించింది. దీంతో Vivo V29 5G కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

Vivo V29 5G సర్టిఫికేషన్ వివరాలు

  • V8073L0A0 అనే మోడల్ నంబర్ తో ఎఫ్‌సీసీ లిస్టింగ్ లో Vivo V29 5G కనిపించింది.
  • లిస్టింగ్ ప్రకారం, Vivo V29 5G ఫోన్ 5జీ, ఎల్టీఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ తో వస్తోంది.
  • Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4505 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం.
  • ఈ హ్యాండ్సెట్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

యునైటెడ్ స్టేట్స్ లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు అమ్ముడవ్వాలన్నా తయారవ్వాలన్నా దానికి FCC సర్టిఫికేషన్ అవసరం. ఈ సర్టిఫికేషన్ ని క్లియర్ చేస్తే, సదరు డివైజ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ లిమిట్ కి లోబడే ఉందని అర్థం.

Vivo V29 5G లాంచ్ తేదీ (అంచనా)

Vivo V29 5G స్మార్ట్ ఫోన్ వివిధ మార్కెట్స్ లో ఎంట్రీ ఇవ్వనుందని రివీలైన సర్టిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. అయితే, లాంచ్ తేదీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, Vivo V29 5G డివైజ్ ఆగస్టులో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.