Vivo T3x 5G ఇండియా లాంచ్ ఖరారు

Highlights

  • త్వరలో Vivo T3x 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ వివో టీ3ఎక్స్ 5జీ ఇండియా లాంచ్ ఖరారైంది. టీజర్ ద్వారా లాంచ్‌ని వివో కన్ఫర్మ్ చేసింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Vivo T3x 5G ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo T3x 5G లాంచ్ వివరాలు

వివో కంపెనీ తాజాగా Vivo T3x 5G యొక్క టీజర్ ని విడుదల చేసింది. దీన్ని గమనిస్తే ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివో టీ3ఎక్స్ 5జీ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ పై దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. అయితే లాంచ్ తేదీకి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. అయితే చిప్సెట్ పేరుని పేర్కొనలేదు. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

అంటుటు స్కోర్ ని బట్టి, Vivo T3x 5G లో కాస్త శక్తివంతమైన ప్రాసెసర్ ఉంటుందని అర్థమవుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు గత వారం ఓ వార్త కథనం వెలువడింది. అలాగే ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు సమాచారం.

Vivo T3x 5G డివైజ్ గత మోడల్ Vivo T2x 5G కి సక్సెసర్ గా మార్కెట్ లోకి రానుంది. Vivo T2x 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎల్సీడీ స్క్రీన్, 50ఎంపి కెమెరా సెటప్ తో వచ్చింది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Vivo T2x 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo T2x 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.