Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు

Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G, Y28s, Y28e లాంచ్
  • బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన ఫోన్స్
  • లిస్టింగ్స్ ద్వారా ఖరారైన డివైజెస్ పేర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు

వివో టీ3 లైట్ 5జీ, వివో వై28ఎస్ 5జీ, వివో వై28ఈ 5జీ డివైజెస్ బ్లూటూత్ ఎస్‌ఐజీ పై లిస్ట్ అయ్యాయి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై Vivo T3 Lite 5G ఫోన్ V2356 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. వివో వై28ఎస్ 5జీ V2346, వివో వై28ఈ 5జీ V2307 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.

ఈ అన్ని స్మార్ట్‌ఫోన్లు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందాయి. బీఐఎస్ పై Vivo Y28s 5G V2351 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.