Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • భారత్‌లో Vivo T3 Lite లాంచ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite ధర

Vivo T3 Lite డివైజ్ రెండు మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo T3 Lite యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.

Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ వైబ్రంట్ గ్రీన్ మరియు మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్స్ లావాదేవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మొదటి రోజు సేల్‌లో మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత బేస్ మోడల్ ధర రూ.9,999 కి, టాప్ మోడల్ ధర రూ.10,999 కి మారుతాయి.

జులై 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా డివైజ్ ను కొనుగోలుకి చేయవచ్చు.

Vivo T3 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Lite లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo T3 Lite డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ సెన్సర్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo T3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite లో ఐపీ64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.