Vivo T3 Lite 5G: రివీలైన వివో టీ3 లైట్ 5జీ లాంచ్ టైమ్‌లైన్, ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G లాంచ్
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఏడాది మార్చిలో లాంచైన వివో టీ3 5జీ ఫోన్‌కి లైట్ వర్షన్ గా Vivo T3 Lite 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, ధర మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 91mobiles ఈ వివరాలను తన కథనంలో ప్రచురించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite 5G లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ ఆఖర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే లాంచ్ తేదీని వివో ప్రకటించనుంది.

Vivo T3 Lite 5G ధర రూ.12,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే రూ.11,999 వద్ద ఫోన్ ప్రైస్ ఉండవచ్చు. వివో ఇప్పటి వరకు రూ.20,000 లోపే 5జీ ఫోన్లను లాంచ్ చేసింది.

Vivo T3 Lite 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఏఐ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెకండరీ సెన్సర్ కూడా ఉంటుందని అంచనా.

Vivo T3 Lite 5G కి సంబంధించి ఇతర వివరాలు ఏవీ రివీల్ కాలేదు. త్వరలోనే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Vivo T3 Lite 5G డిజైన్

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ లో పంచ్ హోల్ నాచ్, కర్వ్డ్ ఎడ్జెస్, ప్యాటర్న్డ్ బ్యాక్ ప్యానెల్ ఉంటాయి. Vivo T3 Lite 5G డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.