Vivo T3 Lite 5G: జూన్ 27న భారత్‌లో లాంచ్ కానున్న వివో టీ3 లైట్ 5జీ

Highlights

  • జూన్ 27న Vivo T3 Lite 5G లాంచ్
  • ధర రూ.12,000 లోపు ఉండే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 27వ తేదీన ఈ డివైజ్ ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo T3 Lite 5G ఇండియా లాంచ్ వివరాలు

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జూన్ 27వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇకపోతే, ఈ ఫోన్ యొక్క ధర మరియు సేల్ వివరాలు జూన్ 27న మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడవుతాయి.

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.12,000 లోపు ఉంటుందని సమాచారం.

Vivo T3 Lite 5G స్పెసిఫికేషన్స్

Vivo T3 Lite 5G డివైజ్ మీడియాటెక్ 6300 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సోని సెన్సర్స్‌ను ఈ ఫోన్ లో అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే స్పెసిఫికేషన్స్ పై పూర్తి స్పష్టత రానుంది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.