డైమెన్సిటీ 6020 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo T2x 5G

Highlights

  • మీడియాటెక్ ప్రాసెసర్ తో లాంచైన Vivo T2x 5G
  • 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 తో వచ్చిన డివైజ్
  • భారత్ లో Vivo T2x 5G ధర రూ.12,999 తో ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో Vivo T2x 5G ఫోన్ ని లాంచ్ చేసింది. దీంతో పాటు Vivo T2 5G డివైజ్ కూడా లాంచైంది. ఈ ఆర్టికల్ లో Vivo T2x 5G గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Vivo T2x 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo T2x 5G ధర, సేల్

భారత్ లో Vivo T2x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.12,999 గా ఉంది. 6జిబి + 128జిబి మోడల్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. ఇక టాప్ మోడల్ 8జిబి + 128జిబి యూనిట్ ధర రూ.15999 గా ఉంది. రూ.1000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మరైన్ బ్లూ, అరోరా గోల్డ్, గ్లిమ్మర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఏప్రిల్ 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు వివో వెబ్ సైట్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలు కానుంది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

  • 6.58-ఇంచ్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్
  • 50ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Vivo T2x 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo T2x 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.