120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Vivo T2 4G వేరియంట్

Highlights

  • రష్యాలో లాంచైన Vivo T2 4G
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చిన డివైజ్
  • Vivo T2 4G ధర RUB 27,768 (సుమారు రూ.24,768)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు రష్యాలో Vivo T2 4G వేరియంట్ ని లాంచ్ చేసింది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పటికే Vivo T2 సిరీస్ లో Vivo T2 5G, Vivo T2x 5G, Vivo T2 Pro 5G ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు Vivo T2 4G డివైజ్ రష్యాలో లాంచ్ అయ్యింది.

Vivo T2 4G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్, అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 3.5 ఎంఎం ఆడియో జాక్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo T2 4G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo T2 4G ధర, లభ్యత

Vivo T2 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను RUB 27,999 (సుమారు రూ.24,768) గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ రష్యాలో కొనుగోలుకి అందుబాటులో ఉంది.

Vivo T2 4G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: Vivo T2 4G లో 6.62-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎస్‌జీఎస్ ఐ కేర్ డిస్ప్లే సర్టిఫికేషన్, Schott Xensation glass ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo T2 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Vivo T2 4G లో 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Vivo T2 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo T2 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, ఆరా లైట్ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo T2 4G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: Vivo T2 4G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • ఆడియో: Vivo T2 4G లో స్టీరియో స్పీకర్ సెటప్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • డైమెన్షన్స్: Vivo T2 4G డివైజ్ 162.51 మి.మీ పొడవు, 75.81 మి.మీ వెడల్పు, 7.70 మి.మీ మందం ఉంటుంది.
  • కనెక్టివిటీ: Vivo T2 4G డివైజ్ లో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గెలీలియో, గ్లొనాస్, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Vivo T2 4G ఫోన్ సీ గ్రీన్, ల్యావెండర్ గ్లొ, బ్లాక్ ఆనిక్స్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous articleSnapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro
Next article50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A79 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.