Vivo S19: గీక్‌బెంచ్ పై లిస్టైన వివో ఎస్19 స్మార్ట్‌ఫోన్

Highlights

  • త్వరలో Vivo S19 లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2364A
  • లైనప్‌లో వస్తోన్న S19, S19e, S19 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo S19, Vivo S19e మరియు Vivo S19 Pro అనే డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి గీక్‌బెంచ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo S19 గీక్‌బెంచ్ వివరాలు

Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై V2364A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇప్పుడు గీక్‌బెంచ్ 5.5.1 బెంచ్‌మార్క్ టెస్ట్ స్కోరింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo S19 డివైజ్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 920 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3414 పాయింట్లు స్కోర్ చేసింది. లిస్టింగ్‌ని బట్టి, ఈ హ్యాండ్సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo S19 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి. చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40GHz.

Vivo S19 స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం Vivo S19 Pro కూడా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, మాలి-జీ715-ఇమ్మోర్టాలిస్ ఎంసీ11 జీపీయూ రివీల్ అయ్యాయి.

3సీ సర్టిఫికేషన్ ద్వారా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. దీంతో ప్రో వేరియంట్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు స్పష్టమైంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే అన్ని వేరియంట్స్ యొక్క లాంచ్ తేదీ మరియు ఇతర వివరాల ప్రకటన ఉండవచ్చు.

Vivo S18 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S18 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.9 యాస్పెక్ట్ రేషియో, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S18 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo S18 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా అందించారు.

సాఫ్ట్‌వేర్: Vivo S18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Vivo S18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo S18 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

సెక్యూరిటీ: Vivo S18 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.