Smartphones: 2024 మార్చిలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

Highlights

  • మార్చిలో ఎంట్రీకి రెడీగా ఉన్న ఫోన్లు
  • Nothing Phone 2a లాంచ్ తేదీ మార్చి 5
  • Xiaomi 14 విడుదల తేదీ మార్చి 7

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ 2024 మార్చిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. టాప్ బ్రాండ్ శాంసంగ్ మొదలుకుని, లేటెస్ట్ సెన్సేషన్ నథింగ్ వరకు తమ ఉత్పత్తులను మార్చిలో విడుదల చేయనున్నాయి. దీంతో మార్చి నెలలో ఫోన్ల జాతరకు యూజర్లు సిద్ధమవుతున్నారు. Xiaomi, Samsung, Nothing, Realme, Vivo బ్రాండ్స్ తమ ఫోన్లను 2024 మార్చిలో లాంచ్ చేయబోతున్నాయి. సరే, ఓసారి ఆ జాబితాపై కన్నేద్దాం పదండి.

Nothing Phone (2a)

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మార్చి 5న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ Nothing Phone (2) కంటే తక్కువ ధరలో మార్కెట్ లోకి రానుంది.
  • Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోంది.

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మార్చి లేదా ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటాయి.

Realme 12+ 5G

Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. మార్చి 6న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

Vivo V30 సిరీస్

Vivo V30 సిరీస్ మార్చి నెలలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. Vivo V30 Pro డివైజ్ వివో వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ జీస్ ఆప్టిక్స్ మరియు ఆరా లైట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. Vivo V30 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Xiaomi 14

Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 7 న భారత్ లో లాంచ్ కానున్నాయి. చైనాలో ఇప్పటికే ఈ సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra మార్కెట్ లోకి రానున్నాయి. Xiaomi 14 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి.