Upcoming Smartphones: జూన్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి రాబోవు జూన్ నెల కొత్త ఫోన్ల లాంచెస్‌తో వెల్కమ్ చెప్పనుంది. వరుసబెట్టి ఫోన్లు వచ్చే నెలలో మార్కెట్‌ని ముంచెత్తనున్నాయి. వివిధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ కొత్త డివైజెస్‌ను జూన్ నెలలో లాంచ్ చేయబోతున్నాయి. 2024 జూన్ లో చవకైన ఫోన్ల దగ్గర నుంచి ఖరీదైన ఫోన్ల వరకు రకరకాల బడ్జెట్స్ లో మొబైల్ ఫోన్లు మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాయి. మరి, ఆ ఫోన్ల జాబితా ఏంటో తెలుసుకుందామా?

జూన్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

Samsung Galaxy M35 5G: ఈ స్మార్ట్‌ఫోన్ 2024 జూన్ నెలలో లాంచ్ కాబోతోంది. కంపెనీ ఇంకా తేదీని ప్రకటించలేదు. త్వరలోనే ఈ ప్రకటన రానుంది. గెలాక్సీ ఎమ్35 5జీ డివైజ్‌లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

Xiaomi 14 CIVI: షావోమి సంస్థ భారతీయ మార్కెట్ లో షావోమి 14 సీవీ డివైజ్‌ను లాంచ్ చేయబోతోంది. జూన్ 12వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ 5 కెమెరా సెన్సర్స్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్, 50ఎంపి + 50ఎంపి +12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

OPPO Reno 12: OPPO Reno 12 స్మార్ట్‌ఫోన్ కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచ్ అయ్యింది. త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఒప్పో రెనో 12 లో 6.7-ఇంచ్ 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్, 50ఎంపి రియర్ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

OPPO Reno 12 Pro: రెనో 12 సిరీస్ లో వస్తోన్న టాప్ వేరియంట్ OPPO Reno 12 Pro జూన్ నెలలో భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 16జిబి ర్యామ్, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి రియర్ కెమెరా, 6.7-ఇంచ్ 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Vivo X Fold 3 Pro: జూన్ 6వ తేదీన భారతీయ మార్కెట్ లో Vivo X Fold 3 Pro డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 6.53-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్, 8.03-ఇంచ్ ఇంటర్నల్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 50ఎంపి ఒవి50హెచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి పెరిస్కోప్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme C63: ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే జూన్ నెలలో Realme C63 విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. మలేషియాలో జూన్ 5వ తేదీన Realme C63 లాంచ్ కానుంది. అదే సమయంలో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ612 చిప్, 6జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

HMD Arrow: నోకియా బ్రాండ్ పేరెంట్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ తన సొంత బ్రాండ్ పై ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. త్వరలో భారత్ లో HMD Arrow అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. జూన్ నెలలో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. HMD Arrow ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Honor Magic 6 Pro: భారతీయ మార్కెట్ లోకి Magic 6 సిరీస్‌ను తీసుకొస్తామని హానర్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా జూన్ నెలలో Honor Magic 6 Pro డివైజ్ ను హానర్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 180ఎంపి రియర్ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 5600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.