Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్)

గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి.

  • Moto G64 5G
  • iQOO Z9 Turbo
  • Vivo T3x 5G
  • Realme P1 5G
  • Realme C65

Moto G64 5G

మోటో జీ64 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 16న లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. Moto G64 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Moto G64 5G ఫోన్ మూడు ప్రీమియమ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది.

iQOO Z9 Turbo

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోంది. ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. ఈ ఫోన్ 1.5కే డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Vivo T3x 5G

వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

Realme P1 5G

రియల్మీ నుంచి కొత్తగా పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అవి: Realme P1 5G మరియు Realme P1 Pro 5G. ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 15వ తేదీన లాంచ్ కానున్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం ఈ పీ-సిరీస్ ని తీసుకొస్తున్నట్లు రియల్మీ తెలిపింది. Realme P1 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది. Realme P1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది.

Realme C65

Realme C65 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. రియల్మీ సీ65 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.