Jio, Airtel ఖాతాలో కొత్త సబ్‌స్క్రైబర్లు; 2.47 మిలియన్ కస్టమర్లను కోల్పోయిన Vodafone Idea

Highlights

  • 21.11 శాతానికి పడిపోయిన ఒకప్పటి మార్కెట్ లీడర్ వీఐ షేర్
  • ట్రాయ్ తాజా రిపోర్ట్ ప్రకారం, 2022 డిసెంబర్ లో 2.47 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
  • 1.7 మిలియన్ యూజర్లను పొందిన ఎయిర్టెల్, 1.52 మిలియన్ సబ్‌స్క్రైబర్లను పొందిన జియో

Vodafone Idea సంస్థ యొక్క మార్కెట్ షేర్ దారుణంగా పడిపోయింది. తాజాగా టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన రిపోర్ట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుల ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతోన్న వొడాఫోన్ ఐడియా సంస్థ 2.47 మిలియన్ కస్టమర్లను కోల్పోయి మరింత దిగజారింది. ఇక 5జీ నెట్వర్క్ ని కూడా లాంచ్ చేసేందుకు వీఐ ఎంతో సతమతమవుతోంది.

మరోవైపు ఎయిర్టెల్, జియో భారీగా సబ్‌స్క్రైబర్లను పొందాయి. భారతి ఎయిర్టెల్ ఖాతాలో 1.7 మిలియన్ యూజర్లు చేరగా, ముకేశ్ అంబాని కంపెనీ జియో 1.52 మిలియన్ కస్టమర్లను పొందింది. ఈ గణాంకాలు ట్రాయ్ విడుదల చేసిన 2022 డిసెంబర్ కి సంబంధించినవి.

ఓవరాల్ సబ్‌స్క్రైబర్ కౌంట్ నాలుగు నెలల్లో వరుసగా మూడోసారి దిగజారింది. 2022 నవంబర్ లో ఉన్న 1.143 బిలియన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య, 2022 డిసెంబర్ కి వచ్చేసరికి 1.142 కి చురుకుందని ట్రాయ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో యూజర్లు తగ్గడంతోనే ట్యాలీ లో తగ్గుదల కనిపిస్తోందని ట్రాయ్ తెలిపింది. మరొక వైపు పట్టణ ప్రాంతాల్లో వైర్లెస్ సబ్‌స్క్రిప్షన్స్ 626.3 మిలియన్ నుంచి 627.03 మిలియన్ కి పెరిగింది.

ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ సంస్థలు 37.14 పర్సెంట్ మరియు 32.16 పర్సెంట్ మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నాయి. మరొకవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్ 21.11 శాతానికి తగ్గిపోయింది. వైర్‌లైన్ సేవల విషయంలో జియో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

ఫిస్కాల్ థర్డ్ క్వార్టర్ వరకు వీఐ నెట్ లాస్ రూ.7,595.5 కోట్ల నుంచి రూ.7,990 కోట్లకు పెరిగాయి. అత్యధిక ఫైనాన్సింగ్, నిర్వహణ ఖర్చులు వెరసి వొడాఫోన్ ఐడియా కు భారీ నష్టాలను మిగిలాయి.

Vi 5G రోలౌట్ ప్లాన్స్

5జీ ఇకోసిస్టమ్ అభివృద్ధి కోసం, వొడాఫోన్ ఐడియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్మీ లతో జట్టు కట్టింది. ఇతర అగ్ర సంస్థలతో కలిసి తన యూజర్ల కి 5జీ రోలౌట్ ని అందించేందుకు వీఐ అడుగులు వేస్తోంది. ఎల్ అండ్ టీ స్మార్ట్ వరల్డ్ తో కలిసి హెల్త్ కేర్ వంటి ఇండస్ట్రీ యూజ్ కేసెస్ ని వీఐ డెవలప్ చేస్తోంది.

ఒకవైపు నష్టాల్లో కూరుకుపోయినప్పటకీ, మరోవైపు 5జీ సాంకేతికతను అందించేందుకు వొడాఫోన్ ఐడియా తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే వీఐ 5జీ వచ్చేందుకు ఇంకా కొన్నేళ్ళ సమయం పట్టనుందని సమాచారం. ప్రస్తుతం అగ్రపథాన దూసుకెళ్తోన్న ఎయిర్టెల్, జియో సంస్థలకు గట్టిపోటీనిచ్చే స్థాయికి వీఐ చేరుకోగలదా? 5జీ నెట్వర్క్ లాంచ్ అయితే వొడాఫోన్ ఐడియాకి మునుపటి రోజులు వస్తాయని ఆశించవచ్చు. వొడాఫోన్ ఐడియా తిరిగి పుంజుకోవాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.