Tecno Spark 20 Pro 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన మార్కెటింగ్ మెటీరియల్

Highlights

  • త్వరలో Tecno Spark 20 Pro 5G లాంచ్
  • మార్కెటింగ్ మెటీరియల్ లీక్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ డివైజ్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపు, Tecno Spark 20 Pro 5G యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లీక్ అయ్యింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్, లుక్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Tecno Spark 20 Pro 5G మార్కెటింగ్ మెటీరియల్ (లీక్)

TechOutlook వెబ్‌సైట్ Tecno Spark 20 Pro 5G యొక్క వివరాలను తన కథనం ద్వారా పంచుకుంది.

Tecno Spark 20 Pro 5G యొక్క మార్కెటింగ్ మెటీరియల్ కి సంబంధించిన ఇమేజ్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

ఇమేజ్ ప్రకారం, టెక్నో స్పార్క్ 20 ప్రో 108ఎంపి అల్ట్రా-క్లియర్ కెమెరా, వర్చువల్ ర్యామ్ తో కూడిన 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది.

లీకైన టీజర్ పోస్టర్‌ని గమనిస్తే, ఛాంపియన్ ఆఫ్ 5జీ అని Tecno Spark 20 Pro 5G గురించి రాసి ఉంది.

Tecno Spark 20 Pro 5G డివైజ్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా తెలుస్తోంది.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

మెమొరీ: Tecno Spark 20 Pro 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Tecno Spark 20 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, టైప్-సీ పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.